ఐపీఎల్ డేటా రేసులోకి బీఎస్ఎన్ఎల్... రూ.248కే రోజూ 3జీబీ

  • 51 రోజుల పాటు వ్యాలిడిటీ 
  • రూ.258కి జియో ప్రీపెయిడ్ ప్లాన్
  • రోజూ 2 జీబీ డేటా ఆఫర్
  • పోటీ సంస్థ కంటే ఒక జీబీ అదనపు డేటా ఆఫర్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ కూడా డేటా పోటీలోకి వచ్చేసింది. ఐపీఎల్ సీజన్ కావడంతో జియోకు దీటుగా రూ.248 ప్రీపెయిడ్ పథకాన్ని ప్రకటించింది. 51 రోజుల పాటు అమల్లో ఉండే ఈ రీచార్జ్ ప్లాన్ లో 153 జీబీ డేటాను వాడుకోవచ్చు. అంటే రోజూ 23జీబీ డేటా పరిమితి ఉంటుంది. దీనివల్ల చందాదారులు ఐపీఎల్ మ్యాచులను లైవ్ స్ట్రీమ్ చేస్తూ చూసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. రిలయన్స్ జియో రూ.258 ప్లాన్ ను ఐపీఎల్ సీజన్ కోసం ప్రకటించిన విషయం తెలిసే ఉంటుంది. ఈ ప్లాన్ లో రోజూ 2 జీబీ డేటా చొప్పున 51 రోజుల పాటు 102 జీబీను వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఇంకాస్త చొరవ తీసుకుని జియో కంటే రోజూ 1జీబీ అదనపు డేటాను ఆఫర్ చేసింది. బీఎస్ఎన్ఎల్ తాజా పథకం ఈ నెల 7 నుంచి 30 వరకు వరకు అమల్లో ఉంటుంది. అయితే, జియో 4జీ సర్వీసులు అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ 3జీ సర్వీసుల్లో ఉన్న విషయం గమనార్హం.
Go Back to Shorts
bsnl
data plan

More Telugu News